IPL Auction 2025 Live

Andhra Pradesh: గోదావరికి పోటెత్తుతున్న వరద, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం, ముంపు వాకిట్లో ఏజెన్సీ ప్రాంతాలు

ఈ వరదతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది.

Godavari River

Amaravati, Sep 15: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి (Godavari water level rises) కొనసాగుతోంది. ఈ వరదతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.దీంతో పాటుగా గోదావరికి (Godavari ) వస్తున్న వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

భారీ వరద ప్రవాహంతో కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

మూడో ఏడాది కూడా నంబర్ వన్‌గా ఏపీ, ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులు, దేశంలోపెట్టుబడుల ఆకర్షణలో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచిన జగన్ సర్కారు

ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్‌ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో​.. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.