Andhra Pradesh: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్; సంగం డెయిరీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నిలిపివేత, మరోవైపు సీఎం జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

ఇక్కడ 56.86 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఫలితాలు వెల్లడించవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడమే మిగిలి ఉంది....

High Court of Andhra Pradesh | File Photo

Amaravathi, May 7: గత నెలలో ఏలూరు కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరగాలని హైకోర్టు సూచించింది. ఏలూరు కార్పోరేషన్ పరిధిలో వార్డుల విభజన, ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు జరిగాయి, ఈ ఎన్నికలను నిలిపివేయాలంటూ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ అంతకుముందు కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్ వారికి అనుకూలంగానే ఎన్నికలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయడంతో, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఫలితాలు మాత్రం తాము చెప్పేంతవరకు ప్రకటించవద్దని సూచించింది. హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో గత నెల మార్చి 10న ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పకడ్బందీగా, కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించారు. ఇక్కడ 56.86 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఫలితాలు వెల్లడించవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడమే మిగిలి ఉంది.

ఇదిలా ఉంటే, సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఏపి ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్ట్ స్టే విధించింది. డెయిరీ యొక్క స్థిర, చర ఆస్తులు అమ్మాలంటే హైకోర్ట్ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక హైదరాబాద్ సిబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వేసిన ఈ పిటిషన్ వేయగా, కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది.