Andhra Pradesh: తల్లితో అక్రమ సంబంధం, ఆమె కూతురును కూడా వదలని కామాంధుడు, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం, గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

గుంటూరు జిల్లాలో ఓ కామాంధుడు కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. స్థానికులు, బాలిక తల్లి కథనం మేరకు.. పెదకాకాని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన దానమ్మ తన కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Guntur, Oct 11: గుంటూరు జిల్లాలో ఓ కామాంధుడు కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. స్థానికులు, బాలిక తల్లి కథనం మేరకు.. పెదకాకాని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన దానమ్మ తన కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. కుమార్తెను (Daughter) తన వద్దే ఉంచుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుమారు పదేళ్ల క్రితం దానమ్మకు రాయపూడి జోజిబాబుతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి (extra-marital affair) దారితీసింది.

అప్పటికే పెళ్లయి భార్యాపిల్లలను వదిలివేసిన జోజిబాబు దానమ్మతో సహజీవనం ప్రారంభించి ఎన్టీఆర్‌ కాలనీలోనే కాపురం పెట్టాడు. జోజిబాబు, దానమ్మకు మరో ఇద్దరు సంతానం కలిగారు. దానమ్మ మొదటి సంతానం కుమార్తె ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది. ఆ బాలికపై కన్నేసిన జోజిబాబు మాయమాటలుచెప్పి ఆదివారం ఎన్టీఆర్‌ కాలనీకి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన పాప జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.

రూంలో బ్యాంకు మేనేజర్‌తో సెక్స్, తరువాత రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్, హనీ ట్రాప్ కేసులో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్, నిందితురాలు అరెస్ట్

దీంతో దానమ్మ తన కుమార్తెపై జోజిబాబు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆదివారం రాత్రి బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement