 
                                                                 Jaipur, Oct 9: రాజస్థాన్ లో తాజాగా హనీట్రాప్ కేసు (Woman trapped in honeytrap) వెలుగు చూసింది. ఈ కేసులో మహిళ చేతిలో బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన సీమా శర్మ అలియాస్ స్వప్న కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు వచ్చింది. అదే ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్‌తో (Punjab National Bank Manager) పరిచయం పెంచుకుని అతడి ఫోన్ నెంబర్ సంపాదించింది. ఓ రోజు ఫోన్ చేసి.. బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానని, డీల్ కోసం తాను చెప్పిన అడ్రస్‌కు రమ్మని చెప్పింది.
ఆమె చెప్పిన గదికి బ్యాంక్ మేనేజర్ వెళ్లాడు. రూంలోకి వెళ్లిన తరువాత అతడిపై చేయి వేసి అతన్ని మాటల్లోకి దింపింది. మీరంటే నాకిష్టం.. మీతో సెక్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని చెప్పడంతో.. అతను కూడా ఓకే అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి అసలు విషయం బోధపడింది. గదిలో జరిగిన సీన్ అంతా ఆమె వీడియో తీసింది. ఆ వీడియోను అతడికి పంపి బెదిరించింది. రూ.20 లక్షలు (Woman trapped in honeytrap demanded 20 lakhs) ఇవ్వాలని.. లేకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది.
మొదటగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి.. మిగతాది తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆమె నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిగిలిన డబ్బులు ఇస్తాను.. బయట కలవమన్నాడు. ఆమె రాకముందే.. అతడు చెప్పిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ఆమె వచ్చాక అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్‌పాల్ లంబా మాట్లాడుతూ నిందితురాలికి ఇంతకుముందే ఢిల్లీ, అల్వార్‌లలో హనీట్రాప్ కింద కేసులు నమోదయ్యాయన్నారు. బాధితుడు రాజాపార్క్ దగ్గర్లోని హనుమాన్ డాబాకు సీమాను రప్పించాడని, ఆ తర్వాత అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.
.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
