Kanpur, Sep 21: యూపీలో కాన్పూర్ నగరానికి చెందిన ఓ మహిళ శ్రీనగర్ బేస్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఆర్మీ ఆఫీసరును హనీట్రాప్ (Honey Trapping) వేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
రెండేళ్ల క్రితం ఒడిశాలోని సైనిక ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా (Army physiotherapist) పనిచేస్తున్న ఓ ఆర్మీ అధికారికి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు చెందిన ఒక మహిళ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమవడంతో ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఆర్మీ అధికారితో శారీరక సంబంధం పెట్టుకున్న కాన్పూర్ మహిళ ఆ సమయంలో తీసిన అశ్లీల వీడియోలు, ఛాయాచిత్రాలతో బ్లాక్ మెయిల్ (blackmailed with obscene video) చేసింది.
ఆర్మీ అధికారి నుంచి రూ.10లక్షలు వసూలు చేసిన మహిళ, ఆ తర్వాత ఆస్తిలో కొంత భాగాన్ని తనకు బదిలీ చేయమని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆర్మీ అధికారి బంధువు కాన్పూర్ మహిళ హనీట్రాప్, బ్లాక్ మెయిల్ బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడైన ఆర్మీ అధికారి ప్రస్థుతం సెలవులో ఫిరోజాబాద్ నగరంలోని సిర్సాగంజ్ లోని అత్తవారింట్లో నివశిస్తున్నాడు.
ఫిజియోథెరపిస్టు తండ్రి కూడా సైన్యంలోనే పనిచేస్తున్నారు. కాన్పూర్ మహిళ తండ్రి కూడా ఈ బ్లాక్ మెయిలింగ్ లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు.పోలీసులు హనీట్రాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.