Sadananda Gowda (Photo-PTI)

Bangalore, Sep 20: కర్ణాటకలో మరో బీజేపీ నేత అశ్లీల వీడియో వైరల్ (Sadananda Gowda Alleged Sex Clip Leak Case) అవుతోంది. బీజేపీ మాజీ కేంద్ర మంత్రి సదానంద గౌడ అమ్యాయితో వీడియో కాల్ లో అశ్లీలమైన యాంగిల్స్ లో కనిపిస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న "మార్ఫ్డ్ (డీప్ ఫేక్) వీడియో" పై బిజెపి నేత మరియు మాజీ కేంద్ర మంత్రి డివి సదానంద గౌడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీనియర్ బిజెపి నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని (BJP MP Says 'Morphed Deep Fake' Video ) స్పష్టం చేశారు. ఇది తన ఇమేజ్‌ని కించపరిచే ఉద్దేశ్యంతో వీడియో రూపొందించబడిందని తెలిపారు. "నా మార్ఫింగ్ (లోతైన నకిలీ) వీడియో ( Sadananda Gowda Alleged Sex Clip) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని, నా ప్రత్యర్థులు నా ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు ఆ వీడియోని సృష్టించారని నేను తెలియజేస్తున్నాను." అంటూ ట్వీట్‌ చేశారు. ఈ నకలీ వీడియోపై తాను సైబర్ టీంకు ఫిర్యాదు దాఖలు చేశానని, వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతకు ముందు మరో బీజేపీ నేత, మంత్రి రమేశ్‌ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు వచ్చిన సంగతి విదితమే. 

Here's Sadananda Gowda Tweets

అలాగే, నేను కోర్టు ఆదేశాల ప్రకారం, ఎవరైనా కంటెంట్‌ను ఫార్వార్డ్/అప్‌లోడ్ చేయడం చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్షార్హమైనది. ఎవరైనా అలా చేస్తున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి నాకు ఇన్‌బాక్స్ చేయండి" అని బీజేపీ మాజీ ఎంపీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. .దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

బీజేపీ నేత రాసలీలలు, వీడియోని విడుదల చేసిన బాధిత యువతి, దర్యాప్తును వేగవంతం చేసిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం, తన రాజకీయ జీవితాన్ని భగ్నం చేయడానికే విడుదల చేశారని కేసు పెట్టిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి

"రాజకీయ రంగంలో నా ఎదుగుదలతో కలత చెందిన మాల్‌ఫ్యాక్టర్లు, నా పతనం కోసం నా నకిలీ, అసభ్యకరమైన వీడియోను బయటకు తెచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇది నాకు బాధ కలిగిస్తోంది" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.