Hyderabad: 13 మందిని పెళ్ళి చేసుకున్న ఘనుడు అరెస్ట్, పలు సెక్షన్ల కింద పలు స్టేషన్లలో కేసులు నమోదు

హైదరాబాద్ లో 13మందిని పెళ్లి చేసుకున్న ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్‌ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివశంకర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది.

Arrested (Photo Credits: Pixabay/ Representational Image)

Hyd, July 21: హైదరాబాద్ లో 13మందిని పెళ్లి చేసుకున్న ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్‌ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివశంకర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు (Married 13 Women) విచారణలో తేలింది. నిందితుడు హైదరాబాద్‌, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో శివశంకర్‌పై కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన (Andhra Pradesh Man ) శివశంకర్‌బాబు(33) మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్‌ చేస్తాడు. అనంతరం, వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు.పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు.

తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె.. భర్తకు రూ. 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివశంకర్‌ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో, అనుమానం వచ్చిన.. భార్య అతడి గురించి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు అప్పటి నుండి పరారీలో ఉండగా తాజాగా పోలీసులకు చిక్కాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement