Andhra Pradesh Shocker: గుంటూరు జిల్లాలో దారుణం, వేరే మహిళ మోజులో పడి భార్యకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన భర్త, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం (Extra Marital affair in guntur ) పెట్టుకుని తన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్లన్లు ఇచ్చాడు.దీంతో ఆ యువతికి HIV సోకింది. షాకయిన యువతి ఇదంతా భర్త పనేనంటూ పోలీసులను ఆశ్రయించింది.

HIV and AIDS! (Photo Credit:tOrange.biz)

Guntur, Dec 16: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం (Extra Marital affair in guntur ) పెట్టుకుని తన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్లన్లు ఇచ్చాడు.దీంతో ఆ యువతికి HIV సోకింది. షాకయిన యువతి ఇదంతా భర్త పనేనంటూ పోలీసులను ఆశ్రయించింది. నన్ను వదిలించుకోవడానికే హెచ్‌ఐవీ ప్రయోగం (Husband allegedly injected HIV Blood to Wife) చేశాడని, జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష ప్రయోగం కింద, మోసగించినందుకు, కులాన్ని ప్రస్తావించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీ అడ‌వుల్లో దొరికిన ఎముక‌లు శ్ర‌ద్ధా వాల్క‌ర్‌వే, డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా నిర్ధార‌ణ అయినట్లు తెలిపిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్‌ఐవీ సోకే విధంగా ఓ ఆర్‌ఎంపీతో వైద్యం చేయించినట్లు ఆ వివాహిత గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కారులో వెళుతూ ముగ్గురు బాలికలపై దారుణంగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకా రం.. సీతానగరానికి చెందిన యువతి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మంగళగిరి చెందిన ముప్పెర చరణ్‌కుమార్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. పాప పుట్టిన అనంతరం ఆమెను చరణ్‌కుమార్‌ శారీరకంగా దూరం పెట్టడమే కాకుండా ఇంటికి కూడా రావడం మానేశాడు. పిల్లలు పుట్టిన తరువాత నీకు అనారోగ్యంగా ఉంది వైద్యం చేయిస్తానంటూ మంగళగిరి చెందిన ఆర్‌ఎంపీతో ఆమెకి పలుసార్లు ఇంజక్షన్లు చేయించాడు. కొంత కాలం తరువాత వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ ఉందని తేలింది.

ఇది ఎలా జరిగి ఉండవచ్చని.. తన భర్తను అడిగింది.. అయితే.. భార్యకు రోగం వస్తే.. ఖంగారు పడాల్సిన చరణ్.. కాస్తా.. భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. ఆమె వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో అంగన్ వాడీ కేంద్రం ద్వారా సోకి ఉండొచ్చని మాయమాటలు చెబుతూవచ్చాడు.. భర్తపై నమ్మకం ఉంచిన భార్య మమత.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది.అప్పటి నుంచి తనకు హెచ్ ఐవీ సోకడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది.. ఈ క్రమంలో భర్త చరణ్ లో మార్పును గమనించింది మమత.. తన భర్త మరొక యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకుని షాక్ కు గురైంది.

తనను కాదని.. మరొక యువతితో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావంటూ ప్రశ్నించినప్పటికీ అతని నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ప్రేమ, పెళ్లి అంటూ తన జీవితాన్ని నాశనం చేసి.. మరొక యువతితో ఎఫైర్ సాగిస్తున్నాడని.. ఎంతో ఆరోగ్యంగా ఉండే తనను.. హెచ్ ఐవీ బాధితురాలిని చేసి.. అతను మాత్రం సుఖమయ జీవితాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తోంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement