ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అమీన్ పూనావాలా అత్యంత దారుణంగా 35 ముక్కలుగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ ముక్కలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్ గురించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. సమీప అడవుల్లో శ్రద్ధా శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పంపారు. అయితే ఢిల్లీ అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్ధా వాల్కర్‌వే అని డాక్టర్లు తేల్చారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మెహరౌలీ, గురుగ్రామ్ అడవుల నుంచి ఢిల్లీ పోలీసులు శ్రద్ధా ఎముకల్ని సేకరించారు. అయితే ఆ ఎముకలకు జరిపిన పరీక్షలో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు గుర్తించారు.
Here's Update
Shraddha Walkar Murder Case: DNA From Recovered Bones Matches With Palghar Woman's Father#ShraddhaWalkar #ShraddhaWalkarMurderCase #DelhiPolice #DNA https://t.co/74kS9LQLsX
— LatestLY (@latestly) December 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)