AP Shocker: కూతురిపై వేధింపులు.. అల్లుడి గొంతు కోసి చంపేసిన మామ, చిత్తూరులో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. నిందితుడిగా యూసుఫ్ ఖాన్, బాధితుడిగా సాయిబాబాను గుర్తించారు.
Chittoor, August 1: కుమార్తెపై వేధింపులకు తన అల్లుడిని..ఓ మామ గొంతు కోసి హత్య (Slitting His Throat For Harassing) చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. నిందితుడిగా యూసుఫ్ ఖాన్, బాధితుడిగా సాయిబాబాను గుర్తించారు. కాగా ఖాన్ కుమార్తె హసీనాను పదేళ్ల క్రితం సాయిబాబా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరులోని శంకరయ్య గుంటలో చోటుచేసుకుంది. హసీనాను కొన్నేళ్లుగా వేధిస్తున్నందుకు బాధితుడి మెడను కోసినట్లు యూసుఫ్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి.
సాయిపై దాడి చేసిన తర్వాత, హసీనా తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిందని వార్తా సంస్థ ఇండియా టుడే నివేదించింది. శనివారం రాత్రి, సాయిబాబా.. హసీనాను ఆమె తల్లిదండ్రుల నివాసం నుండి తన ఇంటికి తీసుకువెళ్లడానికి వెళ్ళాడు. ఆ సమయంలో హసీనా కుటుంబ సభ్యులకు సాయికి మధ్య వాగ్వాదం జరిగింది. సంభాషణ వేడెక్కడంతో మాట ఖాన్ అల్లుడిపై దాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి దారుణంగా హత్య (Man Kills Son-In-Law) చేశాడు. నిందితుడిపై సంబంధిత ఐపీసీ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.