Pawan Kalyan vs Volunteers: పవన్‌ కల్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్ల ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి

Pawan Kalyan (Photo-Twitter)

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.

ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే,  దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు

మరోవైపు పవన్ కల్యాణ్‌పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.వారాహి యాత్రలో పవన్ తమపై నిందలు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు చెప్పారు. తాము ఏం చేస్తున్నామో ఆయన చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.

వాలంటీర్లపై పవన్‌ విషం, సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్‌, సమన్లు జారీ

కాగా, ఆదివారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల వెనుక వాలంటీర్లు ఉన్నారని కేంద్ర నిఘా వర్గం చెప్పిందని ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్‌ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement