Duvvada Srinivas: మాకు నాన్న కావాలి, నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు, వాణికి విడాకులు ఇస్తానని వెల్లడి
మాకు నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉన్న ఇంటిపై దాడికి చేయగా దీనిపై స్పందించారు శ్రీనివాస్. సమాజంలో, జగన్ ముందు తనను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు దర్శకత్వంలోనే వాణి నడుస్తోందని ఆరోపించారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందన్నారు. క్వారీ డబ్బులు అన్ని తనకే ఇవ్వాలని రచ్చ చేసేదని మండిపడ్డారు. ఇవాళ తనపైకి తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vij, Aug 10: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితులు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మాకు నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉన్న ఇంటిపై దాడికి చేయగా దీనిపై స్పందించారు శ్రీనివాస్. సమాజంలో, జగన్ ముందు తనను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు దర్శకత్వంలోనే వాణి నడుస్తోందని ఆరోపించారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందన్నారు. క్వారీ డబ్బులు అన్ని తనకే ఇవ్వాలని రచ్చ చేసేదని మండిపడ్డారు. ఇవాళ తనపైకి తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణపాలు, కారంతో రావడం ఏంటని, తనను చంపడానికే వచ్చారని దుయ్యబట్టారు. అందుకే తన భార్య వాణికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తన భార్య వాణి, కుమార్తె హైందవి, వారి బంధువులుపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఎస్ఎఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న తన ఇంటిపై వారు దాడికి దిగారని , గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నంకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు దువ్వాడ శ్రీనివాస్. తనకు క్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వాణి, హైందవి, వారి బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి గత రెండేళ్లుగా దువ్వాడ కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య జడ్పీటీసీ దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా తొలగించింది. దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పగించింది. ఇక ఎన్నికల సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించగా దంపతుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
ఇక సీన్ కట్ చేస్తే మా నాన్న మాకు కావాలంటూ శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటివద్దకు వెళ్లారు వాణి, ఆమె కుమార్తెలు హైందవి, నవీన. పదవీకాంక్షతోనే రెండేళ్లుగా వాని తనను ఇబ్బందులు పెడుతోందని అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌పై సైతం వాణి, ఆమె కూతుళ్లు ఫిర్యాదు చేయడం విశేషం.