Vijayawada, Aug 10: దొంగతనానికి (Theft) హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో బుగ్గకాల్వలోని బాటగంగమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. దేవతను కొలుచుకునేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్
అమ్మవారికి మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేసిన దొంగ
అన్నమయ్య జిల్లాకు చెందిన మదనపల్లె పట్టణంలో బుగ్గకాల్వలోని బాటగంగమ్మ ఆలయానికి ఓ వ్యక్తి వచ్చాడు.
అయితే ఆ వ్యక్తి ఎవ్వరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుడిలా అమ్మవారిని దర్శించుకొని.. ఆపై అదును చూసి అమ్మవారి… pic.twitter.com/YecHPFmMge
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024
అయితే ఆ వ్యక్తి ఎవ్వరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుడిలా అమ్మవారిని దర్శించుకొని.. ఆపై అదును చూసి అమ్మవారి మెడలోని బంగారు గొలుసును దొంగిలించాడు. ఈ తతంగం అంతా అక్కడి సీసీటీవీలో (CCTV) రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దొంగ చేసిన పనిని పలువురు విమర్శిస్తున్నారు.