AP Assembly Budget Session: ఇవాల్టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు, మూడు రోజుల పాటూ వాడి వేడిగా కొన‌సాగ‌నున్న సెష‌న్స్

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account) సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సమావేశాలకు అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.

AP Assembly Sessions 2023 (Photo-X)

Vijayawada, FEB 05: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) ఇవ్వాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account) సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సమావేశాలకు అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొకరోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడతాయి. ఆ వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni seetharam) నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం జగన్, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలంటూ ఈ సమావేశంలో టీడీపీ పట్టుపట్టే అవకాశం ఉంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైన సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ రెడీ అయింది.

 

మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అలాగే, ఎమ్మెల్సీ షేక్ షాబ్ జీ మృతిపట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. బుధవారం ఉదయం 11గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడు రోజులు కొనసాగే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.

Gogula Venkata Ramana Joins YSRCP: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, వైసీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ 

అసెంబ్లీ సమావేశాల నేథప్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో ఆ పార్టీశాసనసభా పక్షం భేటీ అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. సమావేశాల్లో మొత్తం 10 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం ఆశిస్తోంది