AP Assembly Session 2025: దేవుడు మీకు 11 మందిని మాత్రమే ఇచ్చారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు.
Vjy, Mar 5: అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. స్పీకర్‌కు (AP Assembly Speaker Ayyanna Patrudu) దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు’’ అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష హోదా (Opposition Status) ఇవ్వాలంటే సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అంటే కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసీ జగన్ (Jagan) చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నా. అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులతో జగన్ నాకు గత ఏడాది జూన్ 24న లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
జగన్ పిటిషన్ ఇప్పటికీ విచారణకు తీసుకోవాలా.. వద్దా అనే దశలోనే ఉంది. అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించా. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు.. ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు? ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైసీపీ సభ్యులను కోరుతున్నా’’ అని స్పీకర్ పేర్కొన్నారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు.... అలాంటి ప్రజలు ఎన్నుకున్న దేవాలయం ఈ సభ అని తెలిపారు. ‘‘ఈ దేవాలయానికి నేను పూజారిని మాత్రమే. స్పీకర్‌గా దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారిగా ఆశించడం కరెక్టేనా. దేవుడు 11 మందిని మాత్రమే ఇచ్చారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకు నా విజ్జప్తి మీ నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తించి ప్రజల గొంతు వినిపించడానికి సభకు రావాలని రాజ్యాంగ భాద్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని విజ్జప్తి చేస్తున్న’’ అంటూ ఈ వివరాలను వెల్లడిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)