AP Cabinet Meeting: నేడు కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ తొలిసారి భేటీ, ప్రధాన చర్చ ఆ రెండు అంశాలపైనే, కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ..

నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం రేపు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు.

CM-YS-jagan-Review-Meeting

అమరావతి : ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం రేపు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేబినెట్ భేటీ చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలో చేయాల్సిన సవరణలను పునః సమీక్షించి కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం.

Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు 

వివరాల్లోకి వెళితే.. దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఇందులో దాదాపు లక్ష ఎకరాలు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిశ చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో మరోమారు నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించిన మొత్తాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశముంది. గడప గడపకూ ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన అంశంపైనా కేబినెట్ లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అందకుండా అర్హులు ఎవరైనా ఉంటే వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి జగన్ మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Astrology: డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..