YSR Sunna Vaddi Scheme 2020: వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ చెల్లింపులు విడుదల, 14.58 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 510 కోట్లకు పైగా జమ, ఉచిత బోర్లు, పగటిపూటి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం

ఏపీలో పంట నష్టపోయిన రైతుల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ నిధులను (YSR Sunna Vaddi Scheme 2020) విడుదల సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపుల్లో భాగంగా 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ (zero-interest loan scheme) చేశారు. తాజాగా అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపారు.

AP CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Nov 17: ఏపీలో పంట నష్టపోయిన రైతుల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ నిధులను (YSR Sunna Vaddi Scheme 2020) విడుదల సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపుల్లో భాగంగా 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ (zero-interest loan scheme) చేశారు. తాజాగా అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy) మాట్లాడుతూ.. ‘రైతులకు ఎంత చేసినా తక్కువే.18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చాం. రైతుభరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నాం. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నాం. రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశాం. గత ప్రభుత్వం సున్నవడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల ఆ బకాయిలన్నింటినీ మేమే చెల్లించాం. ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. అదే సీజన్‌లో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు.

చంద్రబాబుకు జగన్ సర్కారు ఆఫర్, రాష్ట్ర భద్రతా కమిషన్‌లో బాబుకు చోటు, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

నెల రోజుల్లోపే రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశాం. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్‌ మిల్క్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement