AP State Security Commission: చంద్రబాబుకు జగన్ సర్కారు ఆఫర్, రాష్ట్ర భద్రతా కమిషన్‌లో బాబుకు చోటు, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
File images of AP CM Jagnmohan Reddy and Opp Leader Chandrababu Naidu | Photo - PTI

Amaravati, Nov 15: రాష్ట్ర భద్రతా కమిషన్‌ (AP State Security Commission-SSC) సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనల్లో భాగంగా రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు (N. Chandrababu Naidu) చోటు కల్పించింది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్‌ నిబంధనలు–2020లోని రూల్‌ నంబర్‌–2లోని సబ్‌ రూల్‌–2లో ప్రభుత్వం (Government of Andhra Pradesh) సవరణ చేసింది.

రాష్ట్ర హోంమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిషన్‌లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సభ్యులు. స్వచ్ఛంద సంస్థలు, పలు రంగాల నుంచి మరో అయిదుగురు సభ్యులుగా ఉంటారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో (TDP Govt) ప్రతిపక్ష నేతకు చోటు కల్పించకపోవడం గమనార్హం. కాగా 2018లో ప్రతిపక్ష నేతను గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది.

దీంతో పాటు వెనకబడిన సామాజికవర్గాల నుంచి ఒకరిని నియమించాలని ప్రభుత్వం సూచించింది. . శాంతిభద్రతలు, పరిపాలన, ప్రజాపాలన, మానవ హక్కులు, సామాజిక సేవ, వంటి అంశాల్లో ప్రముఖులను స్వతంత్ర సభ్యులుగాస్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చేర్చనున్నారు.

ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, గత 24 గంటల్లో 753 కరోనా కేసులు, 1507 మంది డిశ్చార్జ్‌, ప్రస్తుతం 17892 యాక్టివ్‌ కేసులు, 6881కు చేరిన మరణాల సంఖ్య

పోలీస్‌ సంస్కరణల్లో భాగంగా ఏపీలో భద్రతా కమిషన్ (AP state security commission) ఏర్పాటు అయింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఈ కమిషన్‌లో చర్చించిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు 2006లో తీర్పు చెప్పింది.

ఈ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు సైతం స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తర్వాత 2013లో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2018, ఏప్రిల్ 9న జీవో 42 జారీ చేసింది. ఇందులో ప్రతిపక్ష నేతకు స్థానం లేదు. ఆ తర్వాత ఈ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాలని ఆదేశించింది.