AP Coronavirus: ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, గత 24 గంటల్లో 753 కరోనా కేసులు, 1507 మంది డిశ్చార్జ్‌, ప్రస్తుతం 17892 యాక్టివ్‌ కేసులు, 6881కు చేరిన మరణాల సంఖ్య
Coronavirus Outbreak in India (Photo-PTI)

Amaravati,Nov 16: రాష్ట్రంలో కరోనా ఇప్పుడు అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా 2వేలలోపే కేసులు (AP Coronaviurs Report) నమోదయ్యాయి. ఇప్పుడు కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 43,044 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 753 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు (Coronavirus in Andhra Pradesh) చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు.. కృష్ణాలో ఇద్దరు.. విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6881కు చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 1507 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 829991 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17892 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దేశంలో గత 24 గంటల్లో 30,548 మందికి కరోనా, 88,45,127 కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య, 435 మంది మృతితో 1,30,070 కి చేరుకున్న మరణాల సంఖ్య

దేశంలో గత 24 గంటల్లో 30,548 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,851 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 435 మంది కరోనా (Coronavirus) కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,070 కి (Coronavirus Deaths) పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,49,579 మంది కోలుకున్నారు. 4,65,478 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు కరోనా కేసులపై రిపోర్ట్ విడుదల చేసింది.