Andhra Pradesh Rains: తుఫాను ముప్పు, నీట మునిగిన నెల్లూరు, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అదేశాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

Amaravati, Nov 11: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ రోజు తీరం దాటనుంది. తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం (Depression to cross Tamil Nadu-Andhra Pradesh coast) ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో (Andhra pradesh Rains) ఏపీ వణుకుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ (AP CM YS Jagan Video Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం అన్నారు. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోండి. వారికి మంచి ఆహారం అందించండి.

బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించండి. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోండి. ఏం కావాలన్నా.. వెంటనే అడగండి. బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచండి. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోండి. లైన్‌ డిపార్ట్‌మెంట్లను సిద్ధంచేయండి. ఎస్‌ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోండి. ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని’’ సీఎం సూచించారు.

దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు

‘‘పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి. వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను కూడా చర్యలు తీసుకోండి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికిన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి.

తాగునీటిప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయండి. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటి పారుదల సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. గండ్లు పడకుండా చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు నీటి ప్రవావాహాలను, వర్షాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయండి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని’’ సీఎం పేర్కొన్నారు.

‘‘రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని.. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఫోన్‌కాల్‌కు తాము అందుబాటులో ఉంటామని.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా రూపుదిద్దుకుంటోందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ నెల 13న అండమాన్‌ సమీపంలో ఏర్పడే అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే అవకాశం వుందని వారు పేర్కొన్నారు. దీనితో రెండు వాయుగుండాలు వరుసగా విరుచుకుపడి వర్షబీభత్సాన్ని సృష్టించనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారినట్టు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు ఆ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం నడుమ కేంద్రీకృతమైనట్టు వారు పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement