Tamil Nadu Rains: దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు
Tamil Nadu Rains (Photo-PTI)

Chennai, Nov 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తుఫానుగా రూపాంతరం (soon with possibility of cyclone) చెందే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా (Low pressure area will turn into depression) మారనుండటంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో భారీగా వర్షాలు (Tamil Nadu Rains) కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. చెన్నైలో రెండు రోజులపాటు కుండపోతగా వర్షాలు కురుస్తాయని, మూడో రోజు చెదురుముదురుగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. చెన్నై సహా ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఈనెల 10వ తేదీన కడలూరు, పెరంబలూరు, అరియలూరు, కళ్లకుర్చి, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, రామనాథపురం, పుదుకోట, శివగంగ, తిరువణ్ణామలై జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇదే విధంగా ఈనెల 11న కడలూరు, విల్లుపురం, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు, పుదుచ్చేరికి రెడ్‌ అలర్ట్‌, రాణిపేట, తిరువణ్ణామలై, వేలూరు, కళ్లకుర్చి, పెరంబలూరు, అరియలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

మరో మూడు రోజులు కుండపోత వర్షాలు, చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌, ఏపీలో నీట మునిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

ఈ రెండు రకాల హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.ల నుంచి 25 సెం.మీల దాకా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించినట్టు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 5.8 కి.మీల ఎత్తున ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చటంతో అల్పపీడనం ఏర్పడినట్టు మంగళవారం వేకువజామున 5.30 గంటలకు నిర్ధారించారు. ఈ అల్పపీడనం త్వరితగతిన వాయుగుండంగా మారి పడమర దిశగా, ఈశాన్యం వైపు దూసుకువచ్చి, గురువారం తీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా రెండు రోజులపాటు కుండపోతగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. డెల్టా ప్రాంతాలు సహా పది జిల్లాల్లో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయి.

బంగాళాఖాతంలో (Bay of bengal) అల్పపీడనం వాయుగుండంగా మారకముందే తీరం పొడవునా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మహాబలిపురం తీరం నుంచి చెన్నై సమీపం ఎన్నూరు తీరం వరకూ మంగళవారం వేకువజాము నుంచే సుమారు 20 అడుగుల ఎత్తున అలలు తీరం వైపు ఎగసిపడుతున్నాయి. సముద్రంలో అలల కల్లోలం కారణంగా నాలుగు రోజులపాటు జాలర్లు చేపలవేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక మెరీనాబీచ్‌ వద్ద, తిరువాన్మియూరు తీరం వద్ద, ఎన్నూరు తీరం వద్ద మంగళవారం ఉదయం నుంచి 3 నుంచి ఏడు మీటర్ల ఎత్తున అలలు తీరం వైపు దూసుకువస్తున్నాయని స్థానిక జాలర్లు తెలిపారు. ఇదేవిధంగా ఎన్నూరు, కాశిమేడు, రాయపురం, మెరీనాతీరం, శీనివాసపురం, పట్టినంబాక్కం, తిరువాన్మియూరు, కోవళం, మహాబలిపురం తీరంలో మంగళవారం రాత్రి వరకూ భారీఅలల తాకిడి కొనసాగింది.

2015 తర్వాత మళ్లీ నీట మునిగిన చెన్నై, మరో మూడు రోజులు తప్పని పెనుముప్పు, తమిళనాడుకు అండగా ఉంటామని తెలిపిన కేంద్రం, సహాయక చర్యలను ముమ్మరం చేసిన స్టాలిన్ సర్కారు

భారీ వర్షాల కారణంగా మంగళవారం 17 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, తిరునల్వేలి, తెన్‌కాశి, విల్లుపురం, మైలాడుదురై, మదురై, శివగంగ, పుదుకోట జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెకర్టర్లు ఉత్తర్వు జారీ చేశారు. రామనాథపురం, కడలూరు, నాగపట్టినం, విరుదునగర్‌, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో స్కూళ్లకు మాత్రమే సెలవు ప్రకటించారు.

రాష్ట్రంలో వర్షాల విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా వున్నట్టు, నివారణ పనుల్లో 6 హెలికాప్టర్లు, 4 విమానాలు పాల్గొననున్నాయని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ తెలిపారు. నగరంలోని ఎళిలగంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, గడచిన 24 గంటల్లో 38 జిల్లాల్లో వర్షాలు కురిశాయని, అత్యధికంగా చెంగల్పట్టు జిల్లాలో 74.70మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ముఖ్యం గా, చెంగల్పట్టు, కన్నియాకుమారి, విల్లుపురం, తూత్తుకుడి, తెన్‌కాశి, కాంచీపురం జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో అతి భారీవర్షం కురిసిందని తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు వాయుగుండంగా మారే అవకాశం, తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలర్ట్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం

ఇక ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో​ అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు.

గడచిన 24 గంటల్లో చెన్నై, తిరుచ్చి, మదురై, తేని జిల్లాల్లో ఐదు గురు మృతిచెందారన్నారు. అలాగే, 64 పశువులు మృతిచెందగా, 538 ఇండ్లు ధ్వంసమయ్యాయన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌గార్డ్‌, రక్షణ, జాతీయ విపత్తుల నివారణ బృందం, అగ్నిమాపక శాఖ, తమిళనాడు విపత్తుల నివారణ బృందాల ఉన్నతాధికారులతో సమావేశమై, రాబోయే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టామ న్నారు. అలాగే, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 4 హెలికాప్టర్లు సూలూరు విమానదళ కేంద్రంలోనూ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 డోనియర్‌ విమానాలు, 2 హెలికాప్టర్లను అవసరమైన ప్రాంతాలకు వెళ్లి సహాయాలు అందించేలా సిద్ధం చేశామన్నారు. చెంగల్పట్టు, కాంచీపురం, పెరంబలూ ర్‌, రాణిపేట, తిరువణ్ణా మలై, విల్లుపురం జిల్లాల్లో ఏర్పాటు చేసిన 75 వరదనివారణ శిబిరాలకు 2,649 మందిని తరలించా మని తెలిపారు.

బంగాళాఖాతంలో గాలుల వేగం అధికంగా వుండడంతో ఈనెల 12వ తేదీ వరకు జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశామని తెలిపారు. వరద బాధింపు, సహాయ క చర్యల కోసం ప్రజలు ఖీూఖికఅఖఖీ అనే వెబ్‌సైట్‌, 9445869848 అనే వాట్సాప్‌ నెంబరును ఫిర్యాదు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.