Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

Polling (Credits: X)

Vijayawada, May 14: ఆంధ్రప్రదేశ్‌ లో (Andhrapradesh) సోమవారం జరిగిన అసెంబ్లీ (Assembly), లోక్‌ సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్‌ లో ఎన్నికల సంఘం అప్‌ డేట్ చేసింది.

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు

జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..

నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు, బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతంపైగా పోలింగ్