AP Elections: నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఏకంగా రూ. 3వేల‌కు పైగా ఎక్కువ‌గా వ‌సూలు, టోల్ గేట్ల ద‌గ్గ‌ర భారీ క్యూ, ఓటేసేందుకు సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు

మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు.

Polling (Photo-ANI)

Hyderabad, May 11: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం (AP Elections) నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు. ముఖ్యంగా ఏపీకి వెళ్తునన ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్‌ అయిపోయాయి. దీంతో కొంతమంది ప్రజలు సొంత వాహనాల్లో ఏపీకి బయల్దేరారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ – విజయవాడ రహదారి వాహనాలతో నిండిపోయింది. టోల్‌గేట్ల (Toll Gates) దగ్గర వందలాది వాహనాలు బారులు తీరాయి.

 

ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కానీ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అవన్నీ నిండిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక చాలామంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు టావెల్స్‌ రెచ్చిపోతున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీల మీద అదనంగా రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఏసీ బస్సుల్లో అయితే అదనంగా మూడు వేల వరకు వసూలు చేస్తున్నారు.