AP Assembly Sessions 2022: ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం

ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యలో 17, 18 సెలవులు రానున్నాయి. టీడీపీ (TDP) ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం (AP Government) అంగీకారం తెలిపింది.

AP Budget Session 2021-22 | Photo: CMO

Amaraavti, Sep 15: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యలో 17, 18 సెలవులు రానున్నాయి. టీడీపీ (TDP) ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం (AP Government) అంగీకారం తెలిపింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌ (CM Jagan mohan reddy), మంత్రులు, అచ్చెన్నాయుడు (Achennaidu) హాజరయ్యారు.

హాట్ హాట్‌గా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. జాబ్ లు ఇవ్వలేని సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ వారు నినదిస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు కావాలనే సభలో రచ్చ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి రెడ్ లైన్ ను దాటారని అన్నారు. ప్లకార్డులు పట్టుకుని సభలోకి రావడం సరికాదని చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif