Benz Circle flyover-II Inauguration: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం, ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
కేంద్రమంత్రి గడ్కరీతో (Union Minister Nitin Gadkari and AP CM YS Jaga) కలిసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ( National Highway Projects to Nation) భూమిపూజ చేశారు.
Amaravati, Feb 17: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కలిసి ప్రారంభించారు. కేంద్రమంత్రి గడ్కరీతో (Union Minister Nitin Gadkari and AP CM YS Jaga) కలిసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ( National Highway Projects to Nation) భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం (Benz Circle flyover-II Inauguration) సంతోషంగా ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్‌పేయి నమ్మారని, వాజ్‌పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి నిర్మాణం జరిగిందని తెలిపారు. కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్ యోజన ఇప్పుడు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు.
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. దాదర్ ఎక్స్ ప్రెస్ వే తనకు కూడా చాలా ప్రత్యేకమైందని, తన నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి విజయవాడకు రోడ్ వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు.
బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.