Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Satyavedu MLA Koneti Adimulam (Credits: X)

Vijayawada, Sep 21: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Satyavedu MLA Koneti Adimulam) లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు మాట్లాడుతూ తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో చేసేదేమీ లేక హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)

అసలేం జరిగిందంటే?

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా టీడీపీ నేత రెండు వారాల కిందట హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించిన ప్రైవేటు వీడియోలను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తనపై కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆదిమూలం. కాగా,  బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడం, తమ క్లయింట్లు ఇద్దరూ కోర్టు బయట రాజీ పడ్డారని లాయర్లు చెప్పడంతో ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ట్యాంకర్‌ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్

KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement