Pune, Sep 21: మహారాష్ట్రలోని పూణేలో (Pune) నమ్మశక్యంగాని ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ పెద్ద ట్యాంకర్ ను (Tanker) ఉన్నట్టుండి రోడ్డు అమాంతం మింగేసింది. రోడ్డుపై అనూహ్య రీతిలో ఏర్పడిన పెద్ద గుంతలో సదరు ట్యాంకర్ కూరుకుపోయింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుంతలో పడ్డ ట్యాంకర్ పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందినదిగా తేలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.
వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..
Here's Video:
భారీ ట్యాంకర్ ను మింగేసిన గుంత..
పూణేలో డ్రైనేజీ క్లీనింగ్ కోసం వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ట్యాంకర్ ఒక్కసారిగా గుంతలో కూరుకుపోయింది.
ట్యాంకర్ క్యాబిన్ వరకు మురుగు నీటిలో మునిగిపోయింది.
చాకచక్యంగా డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
గతంలో ఆ గుంత ప్రదేశంలో బావి… pic.twitter.com/RztBabW2vF
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2024
ఎందుకు జరిగింది?
ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణ జరుపుతున్నారు. గుంత ఏర్పడడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఇటీవలి వర్షాలతో ఈ ప్రమాదం జరిగిందా? లేదా కాంట్రాక్టర్ పనుల్లో లోపమా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచలగూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!