CBN Meets Pawan Kalyan: చంద్ర‌బాబు ఇంటికి భోజనానికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ దాదాపు ఖ‌రారైన‌ట్లే

ఈ భేటీలో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చ‌ర్చ‌ల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

CBN Meets Pawan Kalyan (PIC @ Janasena X)

Viajayawada, JAN 13: ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ (Chandrababu Meets Pawan Kalyan) అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. 12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో (TDP-Janasena)విడుద‌ల చేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వన్ క‌ల్యాణ్ మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు స‌మాచారం. జనసేన షణ్ముఖ వ్యూహం.. టీడీపీ సూపర్ సిక్స్ అనే పేరుతో వారిరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

 

త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో (Pawan kalyan) చంద్ర‌బాబు డిన్న‌ర్ భేటీకి హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చ‌ర్చ‌ల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇక వారి మ‌ధ్య మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం. టీడీపీలో అసెంబ్లీ లేదా లోక్‌స‌భ టికెట్ కోసం చంద్రబాబుకు పవన్ క‌ల్యాణ్‌తో ఒక మాట చెప్పించడానికి టీడీపీ నేతలు ప్ర‌య‌త్నించారు. అందుకోసం ఇటీవల పవన్ కల్యాణ్‌ను టీడీపీ నేత‌లు జలీల్ ఖాన్, వేదవ్యాస్, మాగంటి బాబు క‌లిశారు. మరి కొందరు టీడీపీ నేతలు భేటీ కోసం అపాయింట్ మెంట్ అడుగుతున్నారని చంద్ర‌బాబుతో పవన్ చెప్పార‌ని తెలుస్తోంది. వారితో మాట్లాడాల్సిన అంశాలపై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది.

 

ఇక అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇతర పార్టీల నేతలను, వైసీపీ నేతలను చేర్చుకునే అంశాలపై చర్చ వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి వెళ్తే కలిగే లాభ నష్టాలపై ఫోకస్ చేయాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించార‌ని తెలిసింది. బీజేపీతో ఆచితూచీ స్పందించాలని అభిప్రాయానికి వచార‌ని చెబుతున్నారు. గత ఎన్నికల్లో త‌మ‌కు ఎదురైన అనుభవాలను వారు విశ్లేషించుకున్నార‌ని వినికిడి.