Makar Sankranti 2022: ఆన్‌లైన్‌లో అమ్మకానికి పందెం కోళ్లు, లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతులు, సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జోరుగా దందా...

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పందెం కోళ్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. సోషల్ మాధ్యమాలు అయిన వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు.

Cock Fight (File Image)

భీమవరం, జనవరి 13: కొత్త సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్రా ప్రజలకు సంక్రాంతి అతి పెద్ద పండుగ. జనవరి మాసం మొదలు సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. భోగి, పొంగల్, కనుమ ఇవే కాకుండా కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రెండు నెలల నుంచి కోడి పందేలకు కోళ్ళని సిద్ధం చేస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 నుంచి రూ.500 వరకు ఖర్చు చేస్తారని చెప్తుంటారు శిక్షణ ఇచ్చేవారు. కోడి పుంజులు పందెలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా తయారు చేస్తారు.

ఇప్పటికే కోళ్లను సిద్ధం చేసిన పందెం రాయుళ్లు సోషల్ మీడియాను కూడా వదలట్లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పందెం కోళ్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. సోషల్ మాధ్యమాలు అయిన వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. అందులో భాగంగా పందెం కోడి పేరు, వయసు, ఇప్పటివరకూ అది గెలిచిన పందాలు… ఇలా పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. పండగ నేపథ్యంలో ప్రస్తుతం పందెం కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో పుంజుకు రూ.లక్షల్లో ధరల పలుకుతున్నట్లు చెబుతున్నారు.

కొనుగోలు దారులకు పందెం కోళ్లను అట్టపెట్టెలలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పార్సిల్ చేస్తున్నారు. కోళ్లకు గాలికి తగిలేందుకు చుట్టూ చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. పెట్టెలో కోళ్లు తినేందుకు అవసరమైన దానా లేదా టమోటాలు లాంటివి పెడుతున్నారు. పందెం కోళ్ల కొనుగోళ్ల చెల్లింపులన్నీ పేమెంట్ యాప్స్ ద్వారా జరిగిపోతున్నాయి. ఒకవేళ కోడి నచ్చకపోతే వాపస్ తీసుకునేందుకు కూడా కొంతమంది విక్రయదారులు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేల సంస్కృతి ఎప్పటినుంచో సంప్రదాయంగా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అందరూ పాల్గొంటూ మూడు రోజులపాటుగా ఎంతో సంబరంగా నిర్వహిస్తారు పందెం రాయుళ్లు. మరో విశేషం ఏంటంటే..ఏ కోడి ఏ రోజు పందాలలో పాల్గొంటే విజయం సాధిస్తుందో కూడా ముందే లెక్కలు కడతారు. భోగి సందర్భంగా గౌడ నెమలికి చెందిన పుంజులు పందాలలో విజయం సాధిస్తాయట. 14న కాకి నెమలి, పసి మగల్ల కాకి పుంజులు, కాకిడేగలకు చెందిన పుంజులు గెలుపొందుతాయని, అలాగే 15న డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో విజయం సాధిస్తాయని కోడిపందాల్లో ప్రావీణ్యం ఉన్నవారు వివరిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif