CM Revanth Reddy at the Mathrubhumi International Festival in Kerala(X)

Kerala, Feb 9:  2035లోపు తెలంగాణ జీడీపీ వృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).కేరళలోని మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ కార్యక్రమం(Mathrubhumi International Festival)లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 24 గంటల విద్యుత్, రూ.12000 రైతు భరోసాపై వివరించారు రేవంత్.

కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో తెలంగాణ, హైదరాబాద్ స్థితిగతులను వివరించారు. పీవీ నర్సింహారావు(PV Narasimha Rao)కు కాంగ్రెస్ అన్యాయం చేసింది అనేది అబద్దం అన్నారు. కాంగ్రెస్ ఆయనకు చాలా చేసింది దానికి నేనే సాక్ష్యం.. వారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందన్నారు.

 సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు నాలుగేళ్లు.. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్ 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు జైపాల్ రెడ్డి(Jaipal Reddy) లకు చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసి సౌత్ రాష్ట్రాల నాయకులకు కాంగ్రెస్ మంచి అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ సరైన పద్ధతిలో చేయాలన్నారు. అలా చెయ్యకపోతే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కేజ్రివాల్ గెలికాడు.. అందుకే ఢిల్లీలో కేజ్రివాల్‌ను మేము గెలికాము.. చివరికి బీజేపీ గెలిచింది అని వెల్లడించారు. రైతుకూలీలకు రూ.12000 ఇచ్చామని తెలిపారు. రైతు భరోసా, రైతు భీమా పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.