Vijayasai Reddy Counter to Chiranjeevi: సినీ రంగమేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారంటూ ట్వీట్

ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్‌ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు. సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.

Vijaya Sai reddy (Photo-ANI)

Vijayawada, AUG 10: ఏపీ ప్రభుత్వంపై నటుడు చిరంజీవి(Actor Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరుస కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్‌ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు. సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్‌ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుందని కౌంటర్‌ ఇచ్చారు. పరిశ్రమలోని పేదలు,కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వాళ్లూ మనుషులే. వారి గురించి మీకెందుకు. వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాలు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ వ్యాఖ్యలు చిరంజీవి, అంబటి రాంబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారని అందరూ అనుకున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో బయటకి వస్తే గాని తెలియలేదు. చిరంజీవి ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారని. ఇటీవల పార్లమెంట్ లో సినిమాటోగ్రఫీ చట్టం బిల్ పాస్ చేస్తున్న సమయంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. హీరోల రెమ్యూనరేషన్ గురించి వ్యాఖ్యానించారు. సినిమా బడ్జెట్ లో 50 శాతం హీరోల పారితోషకానికే వెళ్ళిపోతుందని, మిగిలిన 50 శాతం సినీ కార్మికులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూనే చిరంజీవి.. “పార్లమెంట్ వంటి సభలో చర్చించేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాటిమాటికి సినిమా పరిశ్రమపై పడతారేంటి పిచుక పై బ్రహ్మాస్త్రంలా” అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డికి కౌంటర్ అని తెలియడంతో ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు.

 

విజయసాయి రెడ్డి ట్వీట్.. “సినిమా స్టార్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికీ మనుగడ ఉంటుంది. సినీ పరిశ్రమ ఏమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. సినీ పరిశ్రమలోని వారు కూడా మనుషులే. అక్కడ ఉండే పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అయ్యి ఉంటుంది. అలాంటి వారి గురించి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అంటే కుదరదు. సినీ పరిశ్రమలోని యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు.

 

“సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు? ” అంటూ మరో ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే, చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ కి మెగాస్టార్ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif