AP Cabinet Meet Highlights: భారీగా సంక్షేమ పథకాలు, పలు కేటాయింపులు, పలు రద్దులు, సంచలన నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే

అలాగే విశాఖలో గ్రూపన్ కు కేటాయించిన 13.6 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది...

AP Cabinet Approves Crucial Decisions. | (Photo-Twitter)

Amaravathi: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి  (YS Jaganmohan Reddy) అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (Andhra Pradesh Cabinet) సమావేశం జరిగింది. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు రూ .15000 సహాయం అందించే 'అమ్మ ఒడి' (Amma Odi) లాంటి ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది.

రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. గుర్తించబడిన 77 మండలాల్లో 90 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తీవ్రమైన రక్తహీనత మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న

77 గిరిజన ప్రాంతాల్లోని 1,642 గ్రామ పంచాయతీలలోని మహిళలకు మరియు పిల్లలకు అదనపు పోషణను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అంతేకాకుండా, గ్రామీణ నియోజకవర్గాల్లో వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినేట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు

వీటితో పాటు జగ్గయ్యపేటలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన 498.3 ఎకరాల భూకేటాయింపును రద్దు చేసింది. అలాగే విశాఖలో గ్రూపన్ కు కేటాయించిన 13.6 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.