ESI Medicine Scam: రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్
శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ (ACB) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
Amaravati, June 12: ఈఎస్‌ఐ కుంభకోణంలో (ESI Medicine Scam) ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ( Tekkali TDP MLA Atchannaidu) ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ (ACB) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి గ్రామాల్లోకి వైయస్ జగన్, ఎవరైనా పథకాలు అందలేదని ఫిర్యాదులు చేస్తే అధికారులే బాధ్యులు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం
ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని, విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇది తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ (ACB DGP Ravikumar) ఈఎస్‌ఐ స్కాం వివరాలను వెల్లడించారు. ఈఎస్‌ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
Here's Video
మందుల కొనుగోలులో మొత్తం రూ.150 కోట్ల కుంభకోణం జరిగినట్లు తేలిందని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో కట్టబెట్టారని ఏసీబీ డైరెక్టర్ వెల్లడించారు. విజిలెన్స్ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పట్లు తేలిన తరువాతనే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారిలో అచ్చెన్నాయుడుతో పాటు మాజీ ఈఎస్‌ఐ డైరెక్టర్లులు రమేష్ కుమార్, విజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు.
Here's Video
గత ప్రభుత్వం టీడీపీ (Telugu Desam Party (TDP) హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించినట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ అవకతవకలపై సీబీఐ విచారణ, ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది.
ఈ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఇది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అంటూ ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్ సీఎం వైఎస్ జగన్ కుట్రేనని ఆయన దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు సీఎం జగన్ బాధ్యత వహించాలని.. ఆయన ఆచూకీని డీజీపీ వెంటనే వెల్లడించాలన్నారు.
అచ్చెన్నాయుడి కిడ్నాప్ తతంగం అంతా కూడా ప్రభుత్వం బలహీనవర్గాలపై చేస్తున్న దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ విషయంలో హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని.. అరెస్ట్ చేసేందుకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు.