Woman Fraudulent Marriages: నిత్య పెళ్లికూతురు బాగోతం బట్టబయలు, పోలీసులను ఆశ్రయించిన మూడో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ఏపీలో ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం (Woman Fraudulent Marriages) బట్టబయలైంది. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను మాట్రిమోనిలో చూడడం.. పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేయడం, ఆ తర్వాత సెటిల్ చేసుకోవడం ఈ నిత్య పెళ్లి కూతురుకి (fraudulent marriages) వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బెదిరించి సెటిల్ మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మూడో భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతం బట్టబయలైంది.

Representational Image (Photo Credits: unsplash.com)

Amaravati, July 27: ఏపీలో ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం (Woman Fraudulent Marriages) బట్టబయలైంది. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను మాట్రిమోనిలో చూడడం.. పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేయడం, ఆ తర్వాత సెటిల్ చేసుకోవడం ఈ నిత్య పెళ్లి కూతురుకి (fraudulent marriages) వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బెదిరించి సెటిల్ మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మూడో భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతం బట్టబయలైంది. విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టు, కీలక సూత్రధారి పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురు ఆరెస్ట్, కేసు వివరాలను వెల్లడించిన సీపీ ఆర్కే మీనా

వివరాల్లోకెళితే.. తిరుపతికి (Tirupati) చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి యువకులను బుట్టలో పడేస్తుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్‌మెంట్‌ చేసుకుంటుంది.

రెండు పెళ్లిళ్లు తరువాత ముచ్చటగా మూడోసారి గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా (Prakasam Dist) దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి (Veerepalli Village) చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వారు మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషమేంటనే కోణంలో కూపీ లాగాడు. సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం

ఈమెకు ఇప్పటికే చిత్తూరుకు చెందిన పృద్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో గతంలో వివాహమైనట్టు మూడో భర్త తెలుసుకున్నాడు. దీంతో పాటు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.6 ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు స్వప్నని నిలదీశాడు.

దాంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న చీటింగ్‌ బయటపడింది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే రామాంజనులు డెన్మార్క్‌ నుంచి రావాల్సి ఉంది. అతను వస్తే కాని ఈ కేసు ఓ కొలిక్కి రాదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement