Sonu Sood: సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం
Sonu Sood (Photo Credits: Instagram)

Amravati, July 27: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సినిమాల్లో విలన్ అనిపించుకున్నా నిజ జీవితంలో రియల్ హీరో (Actor Sonu Sood) అనిపించుకున్నారు. ఏపీలో రైతు కుటుంబానికి సాయం చేస్తానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారు.చిత్తూరు జిల్లా మదనపల్లిలో రైతు కుటుంబం కోసం (Andhra Pradesh farmer) ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను (Tractor) అందజేశారు. దీనిపై నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసోద్‌కు (Sonu Sood) రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్బంగా సోనూకు రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్

కాగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో (Madanapalle) నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోనూ సూద్ చెంతకు చేరింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు.

Here's sonu sood Tweet

మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. సోనూసూద్ గొప్ప మనసుపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సూన్ సూద్‌కు ధన్వవాదాలు తెలిపారు. ఆ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Here's Babu Tweet

నిన్న మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇస్టున్నట్టు చెప్పిన సోనూ, సాయంత్రం తన మనుషుల ద్వారా ట్రాక్టర్, రోటవేటర్‌ను రైతు నాగేశ్వరరావు కుటుంబానికి అందించారు. దీంతో ఆ రైతు కుంటుంబం ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందంలో మునిగిపోయింది. తమ కష్టాలను తీర్చిన సోనూ సూద్‌ చల్లగా ఉండాలని రైతు కుటుంబం వ్యాఖ్యానించింది. రియల్‌ హీరోకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో రైతు నాగేశ్వర్‌రావు సోమవారం ఉదయం వ్యవసాయ పనులు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఏపీ సీఎంవో ఈ సమాచారంపై వెంటనే స్పందించింది. స్దానిక ఎంపీడీవోకు సమాచారం పంపింది. దీంతో ఆయన స్ధానికంగా వివరాలు తెలుసుకున్నారు. ఇందులో నాగేశ్వరరావు కుటుంబం నెల రోజుల క్రితమే మహల్ రాజు వారి పల్లె గ్రామానికి వచ్చిందని, సరదా కోసం కుటుంబమంతా కలిసి దుక్కిదున్నిందని తెలిసింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి ట్రాక్టర్ వెనక్కి ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ ఆగ్రహం తర్వాత మీడియా మందుకు వచ్చిన రైతు నాగేశ్వరరావు... తాను కుటుంబంతో కలిసి సరదా కోసమే ఈ విధంగా దుక్కి దున్ని వీడియో తీసుకున్నట్లు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ తర్వాత మదనపల్లె కు చెందిన చాలా మంది ఈ వ్యవహారంపై ఆరా తీశారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు.. ఆ ట్రాక్టర్ ను సోనూ సూద్ కు తిరిగి ఇవ్వడమో లేక పంచాయతీకి ఇచ్చేయడమో చేస్తానని చెబుతున్నట్లు సమాచారం.