Guidelines For Deepam Scheme: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, దీపం పథకం ద్వారా దీపావళి నుండి అమలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

మహిళలకు దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అఫిషియల్‌గా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందింనుండగా ఏడాదికి రూ.2,684 ఖర్చు చేయనున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.

Free Gas Cylinders in Andhra Pradesh guidelines for deepam scheme!(X)

Hyd, Oct 22: కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహిళలకు దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అఫిషియల్‌గా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందింనుండగా ఏడాదికి రూ.2,684 ఖర్చు చేయనున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.

దీపం పథకం కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్‌లో ఉన్న విధంగా పేరు, చిరుమానా రాసి అనంతరం డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకోనుండగా ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నెటివిటి సర్టిఫికెట్‌లు అడిగే అవకాశం ఉంది.  మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు 

ఆ తర్వాత ఈ అప్లికేషన్‌లను అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను రెడీ చేస్తారు. ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారు కూడా అర్హులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఏపీలో ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.876 ఉంటే ఇందులో రూ.25 రాయితీ లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతోంది. మిగిలిన రూ.851 లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక సిలిండర్‌ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif