AP Shocker: వీడు తండ్రేనా.. కూతురికి మద్యం తాగించి ఆపై లైంగిక దాడి, ఈ దారుణాన్ని వీడియో తీసిన అతని ప్రియురాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కడపలో అలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో ఓ శాడిస్ట్ తండ్రి.

Woman records video of lover raping his daughter (Photo-/video grabd)

YSR Kadapa, Oct 4: సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కడపలో అలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో ఓ శాడిస్ట్ తండ్రి. పైగా బలవంతంగా కుమార్తెతో మద్యం తాగించి.. లైంగిక దాడి వ్యవహారాన్ని తన ప్రియురాలితో వీడియో (Woman records video of lover raping his daughter) తీయించాడు. ఈ హేయమైన ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు.

సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్‌ జిల్లాలో పని చేస్తున్నాడు. భార్య, కుమార్తె ఉన్నారు. ఇతను బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15 ఏళ్ల కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆపై కుమార్తెపై లైంగిక దాడి ( raping his daughter) చేస్తూ ప్రియురాలితో సెల్‌ఫోన్‌తో వీడియో తీయించాడు.

పెళ్లి పేరుతో పదే పదే యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్, ఆస్పత్రి పాలైన యువతి, నాగపూర్‌లో దారుణ ఘటన

ఈ దారుణ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పింది. అదే రోజు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో పట్టణ శివారులోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ నాగరాజు చెప్పారు. నిందితుడి వద్ద ఉన్న సెల్‌ ఫోన్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం మరియు ఐపిసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now