Lok Sabha Election 2024: మాచర్ల ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు షాక్, కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశాలు, ఈ నెల 6వ తేదీన కేసును విచారించాలని హైకోర్టుకు సూచన

ఆయ‌న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Pinnelli Ramakrishna Reddy (photo-Video Grab)

న్యూఢిల్లీ, జూన్ 3: మాచ‌ర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయ‌న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌ల పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేష‌గిరిరావు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. పిన్నెల్లి అరెస్టుకు హైకోర్టు క‌ల్పించిన వెసులుబాటును ఎత్తివేయాల‌ని శేష‌గిరిరావు త‌న పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం స‌హా హ‌త్యాయ‌త్నం చేశార‌ని తెలిపారు.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు

కాగా, హైకోర్టు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్‌ సెంటర్‌కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని, ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అభిప్రాయపడింది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి, పరిష్కరించాలని సూచించింది.



సంబంధిత వార్తలు

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్