Tirumala Hundi Income Record: రికార్డులు సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెలలోనూ రూ. 100 కోట్ల ఆదాయం.. మూడు నెలల ముందే రూ. 1000 కోట్ల అంచనాకు మించి ఆదాయం

తిరుమల శ్రీవారి హుండీ రికార్డులు కొల్లగొడుతోంది. వరుసగా తొమ్మిదో నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు దాటింది.

Tirumala ( Credits.. Twitter/ANI)

Tirupati, Dec 3: వడ్డీకాసుల వాడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారు రికార్డులు (Records) సృష్టిస్తున్నారు. ఆయన  హుండీ (Hundi) రికార్డులు కొల్లగొడుతోంది. వరుసగా తొమ్మిదో నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు (Rs. 100 Crores) దాటింది. ఈ వార్షిక సంవత్సరంలో (Financial Year) అంటే మార్చి 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు హుండీ ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయం (Income) వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తొలుత అంచనా వేసింది.

‘మా అమ్మగారు 5న చనిపోతారు. సెలవు ఇవ్వండి’ ప్రిన్సిపాల్ కు ఓ టీచర్ ముందస్తు లీవ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్.. అలా ఎందుకు రాశారో తెలుసా??

అయితే, ఇప్పుడు అంచనాలకు మించి ఆదాయం వచ్చి పడుతోంది. మార్చి నుంచి నవంబరు వరకు ప్రతి నెల రూ. 100 కోట్లకుపైగా ఆదాయం హుండీ ద్వారా సమకూరుతోంది. గత 8 నెలల్లో రూ. 1,164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ. 127.30 కోట్ల ఆదాయం వచ్చింది. ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయ అంచనాను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది.

బంగ్లాదేశ్ తో తొలి వన్డే.. టీమిండియాకు అనుకోని షాక్.. సిరీస్ కు దూరంగా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ?.. గాయమే కారణమా??

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement