(Credits: Twitter/ANI)

Patna, Dec 3: ‘మా అమ్మగారు (My Mother) ఈ నెల 5న మరణిస్తారు. అంత్యక్రియల కోసం 6, 7 తేదీల్లో సెలవు (Leave) మంజూరు చేయండి’ స్కూల్ ప్రిన్సిపాల్ కు బీహార్ (Bihar) లోని బాంకా జిల్లా కచారి పిప్రా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు అజయ్ కుమార్ ఇటీవల రాసిన లీవ్ లెటర్ (Leave Application) ఇది. అంతేనా, మరో ఉర్దూ టీచర్ లీవ్ కోసం.. త్వరలో తనకు ఆరోగ్యం (Health) పాడవుతుందని.. సెలవులు మంజూరు చేయాలని విన్నవించాడు. ఇంకో టీచర్ అయితే, మరీ దారుణం.. త్వరలో జరుగబోయే ఓ బంధువుల పెళ్ళికి (Marriage) వెళ్తున్న తాను.. అక్కడ బాగా తింటానని, దీంతో కడుపు నొప్పి రావొచ్చని లేఖలో పేర్కొన్నాడు. కాబట్టి ముందుగానే సెలవు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు.

పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపడిత.. తెరిచి చూస్తే మిలమిల మెరుస్తూ కనిపించిన పురాతన బంగారు నాణేలు.. వాటిని చూసి ఆ ఇల్లాలు ఏం చేసింది? ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన

ఏమిటీ? వీళ్ళందరికీ ఏమైంది? భవిష్యత్తులో జరుగబోయే విషయాలు వీళ్ళకు ఎలా తెలుసు? నిజంగా ఇవి జరుగుతాయా? లేక సెలవుల కోసం వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారా? అని అయోమయంలో ఉన్నారా? అదేం లేదండి. సాధారణ సెలవులు తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు.. మూడు రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, లేకపోతే, సెలవు ఇచ్చేది లేదని భాగల్ పూర్ కమీషనర్ దయనిధన్ పాండే ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ సర్క్యులర్ పై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కారణాలు, సమస్యలు చెప్పి రావు కాదా అంటూ ఇలా వింత లీవ్ లెటర్లతో నిరసన వ్యక్తం చేశారు. అదీ విషయం.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??