Krishna Shocker: పెళ్లన్నాడు, కామవాంఛలు తీర్చుకున్నాడు, యువతి గర్భవతి అని తెలిసి ప్లేటు ఫిరాయించాడు, నమ్మించి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై కేసు పెట్టిన యువతి, కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో ఘటన

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి (Man Arrested For Molesting Girl) చేసి ఆపై మోసం చేసిన ఓ వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు కూచిపూడి ఎస్‌ఐ జీ సత్యనారాయణ తెలిపారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Vijayawada, June 12: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి (Man Arrested For Molesting Girl) చేసి ఆపై మోసం చేసిన ఓ వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు కూచిపూడి ఎస్‌ఐ జీ సత్యనారాయణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు మొవ్వ మండలం నిడుమోలు బ్రాహ్మణ చెరువు సమీపంలోని ఎస్టీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికను అదే కాలనీకి చెందిన కోట దుర్గారావు(20) మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

బాలిక గర్భవతిని చేసి ప్లేటు ఫిరాయించాడు. భాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మోసం చేసిన వ్యక్తికి గతంలో పెళ్లి కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుని అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్‌ బాషా దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసినందుకు మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో ఓ ప్రబుధ్దుడు సైదాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్‌ బాలిక ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌కు తన క్లాస్‌మేట్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు.

స్నేహితుడని నమ్మితే న్యూడ్ వీడియోలు పంపమన్నాడు, లేకుంటే ఫోటోలు ఇంటర్నెట్లో పెడతా అన్నాడు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, మరో చోట ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన ఓ కసాయి తల్లి

ఫ్రెండే కదా అని యాక్సెప్ట్‌ చేయ్యగా.. కొద్దిరోజులుగా ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్‌కు కొన్ని ఫొటోస్‌ను పంపింది. ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్‌ ఐడీని క్రియేట్‌ చేశాడు. తనకు న్యూడ్‌గా వీడియో కాల్‌ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నీంటిని ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిపై శుక్రవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement