Hyderabad, June 12: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడనే (Friend) కదా అని నమ్మినందుకు ఓ ప్రబుద్ధుడు ఆమెను న్యూడ్ వీడియోలు (nude Videos) పంపాలంటూ వేధింపులకు గురి చేశాడు. తట్టుకోలేక ఆ మైనర్ బాలిక (minor Girl) సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సైదాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్‌స్ట్రాగామ్ (Instagram) అకౌంట్‌కు తన క్లాస్‌మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.
ఫ్రెండే కదా అని యాక్సెప్ట్ చేసింది. అనంతరం కొద్దిరోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్‌కు కొన్ని ఫొటోస్‌ను పంపింది. ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు న్యూడ్‌గా వీడియో కాల్ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నీంటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిపై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక నగరంలో ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కన్న కొడుకును కొట్టి చంపిన కేసులో బాలుడి తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. చింతల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన కంజెర్ల ఉదయ(24), సురేష్ భార్యాభర్తలు. వీరికి కుమారుడు ఉమేష్(3) ఉన్నాడు. కాగా ఉదయ జగద్గిరిగుట్టకు చెందిన సెంట్రింగ్ మేస్త్రీ భాస్కర్(26)తో చనువుగా ఉండసాగింది.
భార్య ఉదయలో తేడాను గమనించిన సురేష్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఉదయ సంవత్సరం నుంచి భర్త సురేష్‌తో గొడవపడి చింతల్ మారుతీనగర్‌లో అద్దె గదిలో భాస్కర్‌తో కలిసి ఉంటుంది. ఈ నెల 8వ తేదీన ఉదయ ప్రియుడు భాస్కర్‌తో కలిసి కుమారుడు ఉమేష్‌ను తీవ్రంగా కొట్టింది. దెబ్బలకు తాళలేక ఉమేష్ ఇంట్లోనే మృతిచెందాడు.దీంతో కంగారుపడిన ఉదయ, భాస్కర్‌లు ఉమేష్‌ను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు బాలుడు ఉమేష్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపి అతడి ఒంటిపై దెబ్బలు అనుమానంగా ఉండటంతో అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ, భాస్కర్‌లను అదుపులోకి తీసుకుని