Amara Raja Batteries In Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమరరాజా బ్యాటరీస్, రూ. 9500 కోట్ల భారీ పెట్టుబడితో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు, అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి అమరరాజా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి అమరరాజా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టను న్న ఈ సంస్థకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యా క్టరీ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని, సుమారు రూ.9,500 కోట్లు పెట్టుబడు లు రావడం గొప్ప విషయమని మంత్రి తెలిపారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని అమరరాజా సంస్థ చైర్మన్, ఎండి గల్లా జయదేవ్ పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లల్లో తెలంగాణలోరూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు.