MP Raghurama Petition in High Court: నన్ను అరెస్ట్ చేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి, ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారంటే..

ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్తానని నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Raghu Ramakrishna Raju (Photo-ANI)

Hyd, Jan 11: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్తానని నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.ఏపీ పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్‌ చంద్ర, వై.వి. రవిప్రసాద్‌ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు రఘురామరాజును అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని హైకోర్టుకు ఉమేష్ చంద్ర గుర్తు చేశారు.

మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముందని పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆర్నేష్‌ కుమార్‌ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎంపీ న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు.దీనిని విచారించిన ధర్మాసనం పోలీసులు రఘురామకృష్ణరాజుపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు, CRPC 124 (A) సెక్షన్‌, 120 (B) IPC సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన సీఐడీ

అయితే రఘురామకృష్ణరాజు పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. రఘురామపై కేసు నమోదై, అది ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులను రేపు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.