Night Curfew In AP: ఏపీలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ, మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు మినహాయింపునిచ్చింది. వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను కనుక బహిరంగంగా నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది వరకు, హాలులో అయితే 100 మంది వరకు పాల్గొనేందుకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కర్ఫ్యూ నిబంధనలో భాగంగా సినిమా హాళ్ళలో 50శాతం సీటింగ్ నిబంధన విధించింది ప్రభుత్వం. నిబంధనలో భాగంగా మాస్కు ధరించం అత్యంత తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ నుంచి ఆస్పత్రులు మెడికల్ ల్యాబ్ లో ఫార్మసీ రంగాలతోపాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసులు పైపు ప్రసార సేవలు ఐటి సంబంధించిన సేవలు పెట్రోల్ బంకులు విద్యుత్ నీటి సరఫరా పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపునిచ్చింది.