Gitam University: గీతం యూనివర్సిటీ క్యాంపస్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. కిలోమీటర్‌ మేర కంచె వేసిన అధికారులు

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి నలువైపులా పోలీసుల మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు.

Credits: Twitter

Vizag, April 14: విశాఖపట్నంలోని (Vizag) గీతం యూనివర్సిటీ (Gitam University) వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి (University) నలువైపులా పోలీసుల (Police) మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అటువైపు ఎవ్వరిని రానివ్వకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో గీతం యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో ప్రభుత్వం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. మెుత్తం కిలోమీటర్‌ పొడవునా ప్రభుత్వ యంత్రాంగం కంచె వేసింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

స్థలమంతా ప్రభుత్వానిదే!

కంచె వేస్తున్న స్థలమంతా ప్రభుత్వానిదేనని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు అప్పట్లో భీమిలి ఆర్డీవో భాస్కర్​రెడ్డి వివరించారు. రుషికొండ గ్రామ సర్వే నెం.37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో వివరించారు.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం.. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌ లో వర్షం బీభత్సం.. మరో మూడు రోజుల పాటు వానలు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Advertisement
Advertisement
Share Now
Advertisement