Hyderabad, April 14: నటుడు పోసాని కృష్ణ మురళికి (Posani Krishna Murali) కరోనా (Corona) సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని (Hyderabad) ఏఐజి (AIG) ఆసుపత్రికి తరలించారు. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి. తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.
నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్.. ఆసుపత్రికి
తరలింపు@posani_kmurali #PosaniKrishnaMurali #Corona #Positive #CoronaVirus #Hyderabd #Hospital
— Disha Telugu Newspaper (@dishatelugu) April 14, 2023
ఒక్కరోజే పది వేలకు పైగా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో మాస్కులు ధరించడంతో పాటు కరోనాకు సంబంధించిన పలు నిబంధనలను అమలు చేస్తున్నాయి.