Hyderabad, April 14: హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా నేటి ఉదయం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం (Heavy Rains) కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, అల్వాల్, బోయిన్ పల్లి, మణికొండ, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మాదాపూర్, షేక్ పేట్, ఫిలింనగర్లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం (ఫోటోలు)https://t.co/dRAwzPt2Ke#HeavyRain #Hyderabad #TeluguNews #HyderabadRains
— Sakshi (@sakshinews) April 14, 2023
That roaring thunder sound 😳#hyderabadrains@balaji25_t pic.twitter.com/bJHvNTgmtH
— Shailesh Singh (@shaileshinfo) April 14, 2023
కొన్నాళ్లుగా ఎండ, పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి వర్షాల వల్ల ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.