Ambedkar (Credits: Twitter)

Hyderabad, April 14: బహుజనుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల కంచు మహా విగ్రహాన్ని (Statue) ఇవాళ తెలంగాణ సీఎం (Telangana CM) కేసీఆర్ (KCR) ఆవిష్కరించబోతున్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ లోక్‌సభ ఎంపీ, అంబేద్కర్ మనవడైన ప్రకాశ్ అంబేద్కర్ (Prakash Ambedkar) ముఖ్య అతిథిగా వస్తున్నారు. 125 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని 98 ఏళ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్ రూపొందించారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. విగ్రహావిష్కరణను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్‌పై చల్లేందుకు రకరకాల పూలను రెడీ చేసింది. అంతేకాదు.. హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ జాతి నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించనుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం బౌద్ధ భిక్షువులను ఆహ్వానించిన ప్రభుత్వం... బౌద్ధ సంప్రదాయాలు, ఆచారాలను అనుసరించి.. దీన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లూ చేసింది.

PBKS vs GT, IPL 2023: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు, పంజాబ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ ఘనవిజయం, చెలరేగిన ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్

అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు

దేశంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహం ఇదే. ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని ప్రభుత్వం పిలుపిచ్చింది. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభను జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి.

IPL 2023: ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ సరికొత్త రికార్డు, అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో తొలి స్థానంలో మిస్టర్ కూల్