MS Dhoni (Photo-IPL)

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్‌ హోదాలో మైదానంలో అడుగుపెట్టిన మిస్టర్‌ కూల్‌ ఈ ఘనతను సాధించాడు.

చెన్నై జట్టుపై రెండేళ్లపాటు నిషేధం విధించిన సమయంలో ధోని రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు తరఫున రెండు సీజన్‌లు (2016, 2017) ఆడాడు. ఓవరాల్‌గా ధోని ఇప్పటి వరకు ఈ టోర్నీలో 214 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో పుణె సూపర్‌జెయింట్‌కు 14 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు.

వీడియో ఇదిగో, ధోని సిక్స్‌ల దెబ్బకి బద్దలైన పాత రికార్డులు, ధోనీ బ్యాటింగ్‌కు రాగానే రూ.2 కోట్ల మార్క్‌ను దాటిన జియో సినిమా వ్యూస్

చెన్నై జట్టుకు 200 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు.అతడి కెప్టెన్సీలో సీఎస్‌కే 121 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ధోని తర్వాత ఒక ఐపీఎల్‌ జట్టుకు అత్యధిక మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ఘనత రోహిత్‌ శర్మ పేరిట ఉంది.ఇప్పటివరకు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రోహిత్‌ ముంబై ఇండియన్స్‌కు 146 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు. అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో 238 మ్యాచ్‌లతో ధోని తొలి స్థానంలో ఉన్నాడు.